పెళ్లి కాకముందే తల్లవడం విదేశాల్లో మామూలు విషయమే కావచ్చు. కానీ భారత్‌లో అందుకు కొన్ని సంప్రదాయాలు అడ్డు వస్తాయి. కానీ ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకోకుండా పాశ్చాత్య సంప్రదాయాల వైపు చూస్తున్నారు కొందరు సెలబ్రిటీలు. పెళ్లి కాకుండానే తల్లులుగా మారి అందరికీ షాక్ ఇస్తున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి మీకోసం.
నీనా గుప్తా..
80వ దశకంలో ప్రముఖ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేసింది నటి నీనా గుప్తా. ఫలితంగా పెళ్లి కాకుండానే తల్లైంది. అప్పట్లో ఇదో సంచలనం. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పెళ్లి కాకుండా తల్లి కావడం తొందరపాటేనని ఒప్పుకుంది నీనా. నీనా- వివియన్ల కుమార్తె మసాబా గుప్తా ఫ్యాషన్ డిజైనింగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అమీ జాక్సన్..
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో సహజీవనం చేస్తున్న అమీ జాక్సన్ పెళ్లి కాకుండానే తల్లయింది. బేబీ బంప్ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది.
కల్కి కొచ్లిన్..
నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది కల్కి కొచ్లిన్. ఈ ఏడాది 'గల్లీ బాయ్'లో తన నటనతో మెప్పించింది. ఇటీవలే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది కల్కి. ఇజ్రాయెల్‌కు చెందిన పియానిస్ట్ గై హెర్ష్‌బెర్గ్‌తో కొంత కాలంగా ప్రేమలో ఉందీ భామ. తమ బంధానికి గుర్తుగా తాను గర్భం దాల్చినట్లు కల్కి వెల్లడించింది. కల్కి గతంలో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను వివాహం చేసుకుని ఆ తర్వాత విడిపోయింది.
గ్యాబ్రియెల్లా డీమిట్రియాడెస్
బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. ఈ హీరోకు ఇదివరకే పెళ్లైంది. కానీ భార్యకు విడాకులు ఇచ్చి మరో మోడల్‌తో సహజీవనం చేస్తున్నాడు. భార్యతో అధికారికంగా విడాకులు తీసుకున్న తర్వాత అతడి జీవితంలోకి బాలీవుడ్ బ్యూటీ గ్యాబ్రియెల్లా డీమిట్రియాడెస్ వచ్చింది. గ్యాబ్రియాలానే తమ బంధాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రతీ రోజు నాతో ఉండి.. నన్ను నిలిపేసే మగాడు ఇతడే అంటూ అర్జున్ రాంపాల్ ఫోటో పోస్ట్ చేసింది. తాజాగ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఇదే బాలీవుడ్ హాట్ టాపిక్ అయిపోయింది.
గ్యాబ్రియెల్లా డీమిట్రియాడెస్ ఇవీ చూడండి.. ఫొటో వైరల్: రణ్వీర్ ఏంటా చూపు..!