చిత్రసీమలో రాణించాలంటే ఏ నటీనటులకైనా నటనలో ప్రావీణ్యం ముఖ్యం. ఆధునిక కాలంలో దానితో పాటు డ్యాన్స్‌లోనూ టాలెంట్ ఉన్న వారికే సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. అయితే నృత్యంలోని క్లాసికల్, వెస్ట్రన్, సాల్సా, ఫోక్‌తో సహా బెల్లీ డ్యాన్స్‌పైనా హీరోయిన్లు పట్టుతెచ్చుకుంటున్నారు.
కొత్త కొత్త డ్యాన్స్‌లను నేర్చుకుంటూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియాలో అభిమానులతో పోస్ట్ చేస్తున్నారు పలువురు బాలీవుడ్ హీరోయిన్లు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బెల్లీ డ్యాన్స్‌తో నెటిజన్లను అలరించిన వారిలో కొంతమంది తారల గురించి ఈ కథనం.
1. దేవోలీనా భట్టాచార్జీ
బుల్లితెరలో అనేక కార్యక్రమాలతో పాటు ధారావాహికల్లోనూ నటించి హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది నటి దేవోలీనా భట్టాచార్జీ(Devoleena Bhattacharjee). గతంలో పలు డ్యాన్స్ షోల్లోనూ పాల్గొంది. డ్యాన్స్‌పై ఎంతో ప్రేమ ఉన్న ఈమె.. ఇన్‌స్టాలో చాలాసార్లు డ్యాన్స్ వీడియోలను అప్లోడ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ బెల్లీ డ్యాన్స్ మూమెంట్ వీడియో షేర్ చేయగా.. దానికి విశేష స్పందన లభిస్తోంది.
2. సనయా కపూర్
నటుడు సంజయ్ కపూర్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్‌కు పరిచయమైన సనయా కపూర్(Shanaya Kapoor).. సినిమాల్లోకి రాకముందే నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంది. ఈ నేపథ్యంలో తాను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చాలా వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది. ఇటీవలే ఓ బెల్లీ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేయగా.. దానికి నెటిజన్ల నుంచి బాగా రెస్పాన్స్ వస్తోంది.
3. జాన్వీ కపూర్