తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమాల్లో అలరించి.. బిజినెస్​మ్యాన్​ను పెళ్లాడి!

చిత్రసీమలో ఒకప్పుడు స్టార్​గా ఓ వెలుగు వెలిగిన కథానాయికల నుంచి మోడరన్ హీరోయిన్ల వరకు.. చాలామంది తారలు బిజినెస్​మ్యాన్​లు పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ వారెవరు? ఏ బిజినెస్​మ్యాన్​ను వివాహం చేసుకున్నారు?

Bollywood actresses married to famous businessmen
బిజినేస్​మ్యాన్​లను పెళ్లాడిన బాలీవుడ్​ తారలు!

By

Published : Feb 12, 2021, 10:01 AM IST

సినీ పరిశ్రమలోని చాలామంది తారలు ఎలాంటి నేపథ్యంలో లేకుండా వచ్చినవారే! అలాంటి వాళ్లు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించి.. కొద్దికాలంలోనే స్టార్లుగా ఎదుగుతున్నారు.

హీరోయిన్​గా టాప్​లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు వీడ్కోలు చెప్పినవారు కొందరైతే.. వివాహానికి, నటన రెండింటిని బ్యాలెన్స్​ చేసుకుంటూ కెరీర్​ సాగిస్తున్నవారు మరికొందరు. అయితే అందులో ఎక్కువమంది కథానాయికలు బిజినెస్​మ్యాన్​లనే పెళ్లి చేసుకోవడం విశేషం. అలా చిత్రసీమలో పారిశ్రామికవేత్తలతో ఒక్కటైన తారలు ఎవరో చూద్దాం.

కాజల్​ అగర్వాల్​

గౌతమ్​ కిచ్లు, కాజల్​ అగర్వాల్​

ముంబయికి చెందిన పారిశ్రామికవేత్త గౌతమ్​ కిచ్లూను గతేడాది అక్టోబరులో వివాహం చేసుకుంది కాజల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని చెప్పింది. తెలుగులో ప్రస్తుతం 'ఆచార్య', 'మెసగాళ్లకు మోసగాళ్లు' చిత్రాల్లో నటిస్తోంది.

శిల్పాశెట్టి

రాజ్​ కుంద్రా, శిల్పాశెట్టి

లండన్​కు చెందిన వ్యాపారవేత్త రాజ్​ కుంద్రాను 2009లో శిల్పాశెట్టి వివాహామాడింది. 2012లో వీరికి అబ్బాయి వయాన్​ కుంద్రా జన్మించాడు. గతేడాది అమ్మాయి షమీషా శెట్టి కుంద్రా పుట్టింది.

అమృతా అరోరా

షకీల్ లడఖ్​, అమృత అరోరా

బాలీవుడ్ నటి అమృత అరోరా.. వ్యాపారవేత్త షకీల్ లడఖ్​ను 2009 మార్చి 4న పెళ్లి చేసుకుంది. తల్లి మలయాళీ కేథలిక్​, తండ్రి పంజాబీ కావడం వల్ల ఈ రెండు సంప్రదాయలతో పాటు తన భర్త ముస్లిం కావడం వల్ల ఇస్లాం సంప్రదాయంలో.. అంటే మూడు సంస్కృతులను గౌరవిస్తూ షకీల్​ను మూడుసార్లు అమృత పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.

కరిష్మా కపూర్​

కరిష్మా కపూర్​

ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్​ కపూర్​ను కరిష్మా వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె సమైరా, కుమారుడు కియాన్​ ఉన్నారు.

రీమా సేన్​

రీమాసేన్​, శివ కరణ్​ సింగ్

బాలీవుడ్​ నటి రీమాసేన్​ దిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త శివ కిరణ్​ సింగ్​ను 2012లో పెళ్లి చేసుకుంది. పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. రీమాసేన్​ దక్షిణాదిలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఊర్వశీ శర్మ

ఊర్వశీ శర్మ, సచిన్​ జోషి

జేఎంజే గ్రూప్​ ఆఫ్​ హోటల్స్​, నిర్మాణ సంస్థలు, మినరల్​ వాటర్​, టిష్యూస్​, జిమ్​, స్పా, ఎనర్జీ డ్రింక్​ లాంటి వ్యాపారాలు చేస్తున్న నటుడు, పారిశ్రామికవేత్త సచిన్​ జోషిని ప్రేమించి, 2012లో పెళ్లి చేసుకుంది నటి ఊర్వశి శర్మ.

జూహీ చావ్లా

జై మెహతా, జుహీ చావ్లా

మల్టీ-మిలియనీర్,​ పారిశ్రామికవేత్త జై మెహతాను 1998లో జూహి వివాహమాడారు. వీరికి కుమార్తె జాన్వీ, కుమారుడు అర్జున్​ ఉన్నారు.

కిమ్ శర్మ

కిమ్ శర్మ

వ్యాపారవేత్త అలీ బద్రుదిన్​ పంజనిని వివాహం చేసుకున్న నటి కిమ్​శర్మ.. కెన్యాలో స్థిరపడింది. కెన్యాలోని అత్యంత ధనవంతుల్లో అలీ ఒకరు. ఆయనకు హోటల్​, పరిశ్రమలు, రియల్​ ఎస్టేట్​, రవాణాలో వ్యాపారాలు ఉన్నాయి. కెన్యా, యునైటెడ్​ కింగ్​డమ్​, యునైటెడ్ అరబ్​ ఎమిరైట్స్​, దక్షిణాప్రికా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అతడికి అస్తులు ఉన్నాయి.

ఆయేషా టాకియా

ఆయేషా టకియా, ఫరాన్​ అజ్మి

రాజకీయ నాయకుడు అబు అజ్మి కుమారుడు ఫరాన్​ అజ్మిని 2009లో ఆయేషా టాకియా వివాహమాడింది. ఫరాన్​కు ముంబయిలో చాలా రెస్టారెంట్లు ఉన్నాయి.

రవీనా టాండన్

రవీనా టాండన్​, అనిల్​ తడాని

సినిమాల పంపిణీదారుడు అనిల్​ తడానిని బాలీవుడ్​ నటి రవీనా టాండన్​ పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత పలు సినిమాల్లో నటిస్తున్న ఈమె.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

ఇవీ చూడండి:

టాలీవుడ్​లో రూపొందిన ఉత్తమ ప్రేమకథా చిత్రాలు!

ఒకటి కాదు.. అంతకుమించిన చిత్రాలతో సిద్ధం!

సినిమాలే కాదు దైవభక్తీ ముఖ్యమే!

చిన్నప్పుడే హీరోయిన్​గా ఎంపికై.. ప్రేక్షకులకు దగ్గరై

పోలీస్ స్టోరీ పట్టు.. హిట్టు కొట్టు!

టేకింగ్​లో, యాక్టింగ్​లో ఈ దర్శకులు కింగ్​లే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details