బాలీవుడ్ నటీనటులు ఒకరి తర్వాత ఒకరు కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు కూడా కరోనా సోకింది. సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపిన ఆమె.. ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో స్వీయనిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ మధ్య కాలంలో తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా నిర్ధరణ పరీక్ష చేయించుకోవాలని సూచించింది.
కత్రినా కైఫ్‌కు కరోనా పాజిటివ్ - కత్రినా కైఫ్ కరోనా
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించింది.

కత్రినా కైఫ్
ఇటీవలే అక్షయ్ కుమార్, విక్కీ కౌషల్, భూమి పెడ్నేకర్, గోవింద తదితరులు కరోనా బారినపడ్డారు.
ఇదీ చూడండి:బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్‌కు కరోనా