పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ దర్శకుడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ సినీ ప్రియుల్ని ఎంతగానో ఆకర్షించింది. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
పవర్ చిత్రంలో మొఘల్ చక్రవర్తి సోదరి ఈమేనా? - పవన్ కల్యామ్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న కొత్తం చిత్రం 'హరిహర వీరమల్లు'. తాజాగా ఈ సినిమాలో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, ఆయన సోదరిగా జాక్వెలిన్ కనిపించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి కథతో ఈ పీరియాడికల్ డ్రామా రూపుదిద్దుకుంటోంది. కాగా, ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించనున్నారట. అలాగే ఆయన సోదరిగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనున్నారని సమాచారం. ఈ మేరకు నెట్టింట్లో ప్రచారం జోరుగా సాగుతోంది.
'హరిహర వీరమల్లు'లో పవన్‌కల్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పవన్ సరసన నిధి అగర్వాల్ సందడి చేయనుంది. శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల చేయనున్నారు.