Urvashi Rautela Israel: ఇజ్రాయెల్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా ఎంపికైంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. భారత్ తరఫున ఈ వేడుకకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్న అతిపిన్నవయస్కురాలు ఈమె కావడం విశేషం. డిసెంబరు 12న జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఈ మద్దుగుమ్మ ఇజ్రాయెల్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆమెను ఆ దేశ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఇంటికి ఆహ్వానించారు. ఆమెతో కలిసి ముచ్చటించారు.
ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఇంటికి ఊర్వశి రౌతేలా.. కారణమిదే - ఊర్వశిరౌతేలా ఇజ్రాయెల్ మాజీ ప్రధాని
Urvashi Rautela Israel: ఇజ్రాయెల్‌లో జరగబోయే మిస్ యూనివర్స్ 2021పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఇందులో భాగంగా అక్కడికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మను ఆ దేశ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఇంటికి ఆహ్వానించారు. వారిద్దరూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు.

ఇజ్రాయెల్ మాజీ ప్రధానితో ఊర్వశి రౌతేలా
ఈ నేపథ్యంలో బెంజమిన్ కుటుంబాన్ని కలిసిన ఊర్వశి.. వారికి భగవద్గీతను అందించింది. అంతేకాదూ రెండు, మూడు హిందీ పదాలను కూడా నేర్పించిందట! దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఊర్వశి.. 'బ్లాక్‌రోజ్' సినిమా సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి: లెహంగాలో సొగసరి 'వర్జిన్ భానుప్రియ'