తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కింగ్ నాగార్జున​ పక్కన ఆ​ ముద్దుగుమ్మ! - నాగార్జున దియా మీర్జా సినిమా

హీరో నాగార్జున 'వైల్డ్​డాగ్​'లోని కీలక పాత్రలో కనిపించనుంది బాలీవుడ్​ భామ దియా మీర్జా. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

bollywood-actress-tollywood-debut-with-nagarjunas-wild-dog.
కింగ్ నాగార్జున​ పక్కన ఆ​ ముద్దుగుమ్మ!

By

Published : Jan 24, 2020, 4:03 PM IST

Updated : Feb 18, 2020, 6:12 AM IST

కింగ్ నాగార్జున.. ప్రస్తుతం 'వైల్డ్​డాగ్' అనే ఓ యాక్షన్​ థ్రిల్లర్​లో నటిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్​ నటి దియా మీర్జా కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. హైదరాబాద్​లో పుట్టి పెరిగిన ఈమె.. కెరీర్​ ప్రారంభం నుంచి హిందీలోనే సినిమాలు చేస్తోంది. ఇప్పుడు నాగ్​ సరసన నటిస్తే, ఆమెకిదే తొలి తెలుగు చిత్రమవుతుంది.

'వైల్డ్​డాగ్​'కు సంబంధించిన కీలక సన్నివేశాలు హైదరాబాద్​లో తీస్తున్నారు. ఆ తర్వాత ముంబయిలో కొన్ని ముఖ్యమైన సీన్లు చిత్రీకరిస్తారు. ఇందులో నాగ్​.. ఎన్​ఐఏ అధికారి విజయ్​వర్మ ఉరఫ్ వైల్డ్​డాగ్​గా కనిపించనున్నాడు. అహిషోర్​ సోలమన్​ దర్శకత్వం వహిస్తున్నాడు. నిరంజన్​ రెడ్డి, అన్వేష్​ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి: రివ్యూ: 'డిస్కోరాజా'గా రవితేజ ఆకట్టుకున్నాడా..!

Last Updated : Feb 18, 2020, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details