తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నర్సుగా మారి వైద్య సేవలందిస్తున్న నటి - కరోనా న్యూస్​

యాక్టర్‌గా మారిన డాక్టర్లని చూసుంటారు. మరి నర్సుగా మారిన యాక్టర్‌ని చూశారా? కొవిడ్‌-19 బాధితులకు సేవలందించడానికి నర్సుగా మారింది బాలీవుడ్‌ నటి శిఖా మల్హోత్రా.

Bollywood actress Shikha Malhotra turned as a nurse
నర్సుగా మారి వైద్య సేవలందిస్తున్న నటి

By

Published : Mar 31, 2020, 10:08 AM IST

కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో బయటకు రావడానికే జనం భయపడుతుంటే.. శిఖా మల్హోత్రా మాత్రం ఐసోలేషన్‌ వార్డులో సేవలందించడానికి కోరి మరీ వచ్చింది. దిల్లీ వర్ధమాన్‌ మహావీర్‌ మెడికల్‌ కాలేజీ నుంచి శిఖా మల్హోత్రా బీఎస్సీ నర్సింగ్‌లో పట్టా పుచ్చుకుంది. నటనపై ఆసక్తితో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. షారూఖ్‌ ఖాన్‌ నటించిన 'ఫ్యాన్‌' చిత్రంతో పేరు తెచ్చుకున్న ఈ నటి... 'కాన్‌ చ్లీ' అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు నటనని పక్కన పెట్టి... నర్సుగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంది.

శిఖా మల్హోత్రా

"ఇంట్లోవాళ్లు, తెలిసినవాళ్లు నా నిర్ణయం తెలిసి భయపడ్డారు. ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవద్దంటూ సలహాలిచ్చారు. కానీ నాకు మాత్రం నటిగా స్థిరపడినా, మనసులో నా చదువు వృథా అవుతోందనే వేదన ఉండేది. ఇప్పుడు సరైన అవకాశం వచ్చింది. నా మనసు చెప్పిన మాటనే వినాలనుకున్నా. బాలా సాహెబ్‌ థాకరే ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహించడానికి అవకాశం దక్కింది. ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డులో రోగులకు సేవలందించే అదృష్టం లభించింది. రాత్రిపగలు తేడా లేకుండా ప్రజల కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆసుపత్రుల్లోని వైద్యసిబ్బంది విధుల్లో మునిగి తేలుతున్నారు. దయచేసి ఇంటి నుంచి ఎవరూ బయటికి రావద్దు. మీరందరూ క్షేమంగా ఉంటేనే మేమూ బాగుంటాం. సామాజిక సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలి" అని మల్హోత్రా కోరుతోంది.

ఇదీ చూడండి.. ఇప్పుడు ప్రభాస్​.. నెక్ట్స్​ సల్మాన్​తో 'లక్కీగర్ల్​' పూజా!

ABOUT THE AUTHOR

...view details