బాలీవుడ్‌ప్రముఖ నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్. సల్మాన్ ఖాన్‌తో 'దబాంగ్ 3'లో హీరోయిన్గా నటించింది. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ.. సల్మాన్ గురించి ఆసక్తికర విషయాల్ని చెప్పింది.
'సల్మాన్ నుంచి రోజూ ఎంతో కొంత నేర్చుకుంటా' - telugu cinema news
కండల వీరుడు సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం 'దబాంగ్ 3'. సాయి మంజ్రేకర్ ఓ హీరోయిన్గా నటించింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ.. సల్మాన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.
"సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది.సల్మాన్‌కేవలం నటుడు మాత్రమే కాదు. మంచి మనసున్న వ్యక్తి. సెట్లో ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు సల్మాన్.. కొత్తగా చిత్రసీమలోకి వచ్చిన నటీనటుల్లాగే వ్యవహరిస్తాడు. ఆయన నుంచి రోజూ సెట్లో ఎంతో కొంత నేర్చుకుంటాను" -సాయి మంజ్రేకర్, సినీ నటి
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా కథానాయిక. అతిథి పాత్రల్లో ప్రీతి జింటా, మహేశ్ మంజ్రేకర్‌లు కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అర్బాజ్‌ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈనెల 20న ప్రేక్షకుల మందుకు రానుందీ సినిమా.