తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పోలీసులు ఉన్నారు కాబట్టే మనం ప్రశాంతంగా ఉన్నాం' - latest etv cinema news

రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరం పోలీసులు మనల్ని రక్షిస్తున్నారని ప్రముఖ బాలీవుడ్​ నటి రాణీ ముఖర్జీ తెలిపింది. ముంబయిలో పెట్రోలింగ్​ నిర్వహించే పోలీసు సిబ్బందిని కలిసిన రాణి.. మహిళల భద్రతపై మీడియా సమావేశంలో ముచ్చటించింది.

bollywood actress rani mukharji said sailute to the police
'పోలీసులు ఉన్నారు కాబట్టే మనం ప్రశాంతంగా ఉన్నాం'

By

Published : Dec 7, 2019, 1:40 PM IST

ప్రముఖ బాలీవుడ్​ నటి రాణీ ముఖర్జీ పోలీసులను పొగడ్తలతో ముంచెత్తింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పోలీసులు నిరంతరం మనల్ని రక్షిస్తున్నారని చెప్పింది. ముంబయిలో రాత్రిపూట పెట్రోలింగ్‌ నిర్వహించే పోలీసు సిబ్బందిని కలిసిన రాణి.. అనంతరం మహిళల భద్రత గురించి మీడియాతో ముచ్చటించింది.

"అప్రమత్తతతోనే నేరాలు జరగకుండా చూడగలం. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఎళ్లవేళలా మనల్ని కాపాడుతున్న పోలీస్‌ సిబ్బందికి సెల్యూట్‌. పోలీసులు ఉన్నారన్న ధైర్యంతోనే మనమంతా ప్రశాంతంగా జీవిస్తున్నాం. మన కోసం ఎంతో కష్టపడుతున్న పోలీసుల పాత్రను 'మర్దానీ 2' చిత్రంతో నా వంతుగా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. ప్రత్యేకంగా పోలీసులను కలవడం చాలా సంతోషంగా ఉంది."

-రాణీ ముఖర్జీ, సినీ నటి

ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌.. ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. ప్రస్తుతం రాణీ ముఖర్జీ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘మర్దానీ 2’. గోపీ పుత్రన్‌ దర్శకత్వం వహించాడు. ఇందులో శివాని అనే పోలీస్‌ ఆఫీసర్‌గా రాణీ ముఖర్జీ కనిపించనుంది. ఈనెల 13న ప్రేక్షకుల మందుకు రానుందీ సినిమా.

ముంబయి పోలీసులతో రాణి ముఖర్జీ

ఇవీ చూడండి.. హోరాహోరీ పోరులో బోణీ కొట్టిన టీమిండియా

ABOUT THE AUTHOR

...view details