తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నేను స్వలింగ సంపర్కురాలిని కాను' - ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్

తనపై వస్తోన్న వార్తలన్నీ వదంతులేనని, తాను స్వలింగ సంపర్కురాలిని కానని స్పష్టం చేసింది బాలీవుడ్​ నటి నీలం కొఠారి. ఇటీవలే ఆమె నటించిన 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' వెబ్​ సిరీస్​ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది.

Neelam Kotari
'నేను స్వలింగ సంపర్కురాలిని కాను'

By

Published : Dec 11, 2020, 7:15 AM IST

స్వలింగ సంపర్కురాలు అంటూ తనపై వస్తున్న వార్తలపై బాలీవుడ్‌ నటి నీలం కొఠారి స్పందించింది. తనపై వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని ఆమె స్పష్టం చేసింది. 80-90 దశకాల్లో బాలీవుడ్‌ అభిమానులను అలరించిన ఆమె ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లలో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు విషయాలు వెల్లడించింది. తనపై వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చింది.

"నాపై వచ్చిన వార్తలను నేనూ విన్నాను. నాపైన కూడా పుకార్లు ప్రారంభమవుతున్నాయని నాకు అర్థమైంది. నేను స్వలింగ సంపర్కురాలిని కాను(నవ్వుతూ). ఇక పునరాగమనం గురించి చెప్పాలంటే.. సినిమాల్లోకి తిరిగి రావడానికి నేను నా స్నేహితుల సలహాలు తీసుకున్నాను. ఈ సిరీస్‌ నాకు మంచి పునఃప్రారంభాన్ని ఇచ్చింది. ఇప్పటికీ మమ్మల్ని ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను"

-నీలం కొఠారి, నటి.

ఈ వెబ్‌ సిరీస్‌లో నీలం ప్రధాన పాత్రలో నటించగా.. భవన పాండే, మహీప్‌ కపూర్‌, సీమా ఖాన్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సిరీస్‌ విడుదలైన అతి తక్కువ సమయంలోనే ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇదీ చదవండి:రఘువరన్‌.. భారతీయ చిత్రపరిశ్రమకు ఓ వరం

ABOUT THE AUTHOR

...view details