Katrina Kaif sisters name and photos: బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ తన ప్రియుడు విక్కీ కౌశల్‌తో ఇటీవలే ఏడడుగులు నడిచింది. ఈ పెళ్లిలో భాగంగా కత్రినా ఆరుగురు సోదరీమణులే ఆమెకు తోడు పెళ్లికూతుళ్లయ్యారు. 'Phoolon ki Chaadar' (వధువును వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చే తంతు) లో భాగంగా వారంతా వెంట ఉండి మరీ ఆమెను సాదరంగా వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చారు. తాజాగా ఇదే ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది క్యాట్.
ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే..!
నిజానికి ఇసాబెల్ కాకుండా కత్రినాకు మరో ఐదుగురు అక్కచెల్లెళ్లున్నారన్న విషయం ఈ పెళ్లి ద్వారానే చాలామందికి తెలిసిందని చెప్పచ్చు. అయితే తమ మధ్య ఉన్నది అక్కచెల్లెళ్లకు మించిన అందమైన బంధమంటోంది కత్రినా.
"పెరిగి పెద్దయ్యే క్రమంలో మేమంతా ఒకరికొకరు ప్రాణంగా మెలిగాం. ప్రతి విషయంలోనూ ఒకరినొకరు ప్రోత్సహించుకున్నాం.. ఎంతో కేరింగ్గా ఉన్నాం. నా ఆరుగురు అక్కచెల్లెళ్లే నా బలం. ఈ ప్రేమ, ఆప్యాయత ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.." అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిందీ బాలీవుడ్ అందం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సోదరీమణుల ప్రేమను చూసి ఒకింత భావోద్వేగానికి గురవుతూనే.. మరోవైపు తమ తోబుట్టువులతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.
ఎవరా ఆరుగురు?
- ఇక కత్రినా తోబుట్టువుల విషయానికొస్తే.. ఆమెకు ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు, ఒక అన్నయ్య.
- పెద్దక్క Stephanie Turcotte. తన వ్యక్తిగత విషయాలను చాలా రహస్యంగా ఉంచుతుందామె. అయితే తన పెట్ డాగ్ అంటే ఆమెకు ప్రాణమట! ఈ క్రమంలోనే దాంతో ఫొటోలు దిగుతుంటుంది.
- Christine Turcotte ఆమె రెండో అక్క. నాట్ స్పెన్సర్ అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం గృహిణిగా కొనసాగుతోంది.
- కత్రినా మూడో అక్క Natacha Turcotte Ogorman. ఆమె ఓ జ్యుయలరీ డిజైనర్.
- ఇక మరో సోదరి Melissa Turcotte గణిత శాస్త్రవేత్తగా పేరు గడించింది. ప్రతిష్ఠాత్మక 'Laing O Rourke Mathematics Award' అందుకుందామె.
-
ఆమె తర్వాతి చెల్లెలు ఇసాబెల్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం తను మోడల్‌గా, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇప్పటికే 'క్వాతా', 'సుస్వాగతం ఖుషామాదీద్' .. వంటి చిత్రాల్లో నటించింది. అలాగే తనో డాగ్ లవర్. ఈ క్రమంలో తన పెట్స్‌తో దిగిన ఫొటోల్ని తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది కూడా!
- ఇక కత్రినా ఆఖరి చెల్లెలు Sonia Turcotte. ఆమె ఫొటోగ్రాఫర్‌గా, గ్రాఫిక్ డిజైనర్‌గా కొనసాగుతోంది.
- క్యాట్‌కు ఓ అన్న కూడా ఉన్నాడు. అతని పేరు Sebastien Laurent Michel. తోబుట్టువుల్లో రెండో వాడైన ఆయన ప్రస్తుతం ఫర్నిచర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేయడమన్నా ఆయనకు మక్కువట!