'మహానటి' సినిమా చూశాను.. చాలా బాగుంది మీరు కూడా చూడండి' అంటూ ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక పదుకొణె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టింది. దీనిని కొంతమంది 'దీపిక తెలుగు సినిమా చూసిందోచ్' అని అనుకుంటే.. మరికొంతమంది దీపిక ప్రభాస్ సరసన నటించబోతోందని అనుకున్నారు. దానికీ ఓ కారణముందనుకోండి. ప్రభాస్ తర్వాతి సినిమాకు 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకుడు కావడం. అయితే దీపికను #ప్రభాస్21 కోసం సంప్రదించారా లేదా అనే విషయంలోనే స్పష్టత రాలేదు. కానీ ఆ సినిమాకు దీపిక రెమ్యూనరేషన్ గురించి బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
ప్రభాస్ 21: ఆ హీరోయిన్ అంత డిమాండ్ చేస్తోందా.? - rebalstar prabhas news
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే అతిశయోక్తి కాదు. 'బాహుబలి', 'సాహో' చిత్ర వసూళ్లే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. అందుకే పాన్ ఇండియా కథలను తెరకెక్కించాలనుకునే దర్శక నిర్మాతల తొలి చూపు డార్లింగ్ పైనే పడుతోంది. ఈ నేపథ్యంలోనే యువ దర్శకుడు నాగ్ అశ్విన్ యంగ్ రెబల్‌స్టార్‌తో సినిమా చేయనున్నారు. అయితే ఇందులో నటించే హీరోయిన్ మాత్రం బాగా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
![ప్రభాస్ 21: ఆ హీరోయిన్ అంత డిమాండ్ చేస్తోందా.? prabhas 21](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8030137-768-8030137-1594782607368.jpg)
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందిస్తామని వైజయంతి మూవీస్ ఇప్పటికే ప్రకటించింది. అందరి అంచనాలు అందుకునేలా... వీలైతే దాటేసేలా ఆ సినిమా ఉండబోతోందని చిత్రబృందం చెబుతూ వస్తోంది. మరి అంతటి సినిమాలో బాలీవుడ్ నాయిక తప్పనిసరి అని అనుకుంటున్నారు. ఈ సమయంలోనే దీపిక 'మహానటి' గురించి మాట్లాడటం వల్ల ఆమెనే హీరోయిన్ అనుకోవడం ప్రారంభమైంది. బాలీవుడ్ ముచ్చట్లు చూస్తుంటే అదే నిజమయ్యేలా ఉంది.
సినిమా గురించి ఇప్పటికే చిత్రబృందం దీపికను సంప్రదించిందనే వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే పారితోషికం విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదట. ఇప్పటివరకు తెలుగు పరిశ్రమలో ఓ సినిమా కోసం హీరోయిన్‌కు ఇచ్చిన పారితోషికం కంటే ఎక్కువగా దీపిక డిమాండ్ చేస్తోందని సమాచారం. దీంట్లో నిజానిజాలు తేలాలంటే.. ప్రభాస్ కొత్త సినిమా హీరోయిన్ ప్రకటన జరగాల్సిందే. మరోవైపు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమా పనుల్లో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత #ప్రభాస్21 ఉండబోతోంది.