తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ట్రాక్​ రికార్డు బాగున్నా... 5శాతం పారితోషికమే ఇచ్చారు'

ప్రస్తుతం సినీపరిశ్రమలో పురుష, మహిళా నటీనటులకు సమాన పారితోషికం ఇవ్వట్లేదని చాలా మంది కథానాయికలు ఇదివరకే గళమెత్తారు. తాజాగా బాలీవుడ్​ నటి భూమి పెడ్నేకర్ కూడా ఇదే విషయంపై మాట్లాడింది. సినీరంగంలో ఆమెకు ఎదురైన ఓ సంఘటనను పంచుకుంది.

5శాతం పారితోషకం ఇచ్చి పంపేశారు: భూమి

By

Published : Nov 13, 2019, 4:51 PM IST

వరుస సినిమాలతో జోరు మీదున్న బాలీవుడ్‌ నటి భూమి పెడ్నేకర్‌... ఇటీవల 'శాండ్​ ఖీ ఆంఖ్‌', 'బాలా' చిత్రాలతో విజయాలు అందుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విలక్షణ నటి... ఆసక్తికర అంశాలను పంచుకుంది.

తొలినాళ్లలో పారితోషికం విషయంలో తన సహ నటుడు అందుకున్న దానిలో కేవలం 5శాతం మాత్రమే ఇచ్చారని వాపోయింది భూమి. అదే సమయంలో ఇద్దరికీ హిట్స్‌ ఒకేరకంగా ఉన్నా, తనకు మాత్రం తగ్గించి ఇచ్చారని తెలిపింది.

నటి భూమి పెడ్నేకర్

"ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పారితోషికం సమస్యగా ఉండేది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ల పారితోషికంతో నేను పోల్చుకోవడం లేదు. కొందరు నటులు ప్రేక్షకులను అలరిస్తున్న స్థాయిలో నేను చేయలేను. కానీ కాస్త ఎక్కువే ఆశిస్తాం కదా. నాకు విభిన్న పరిస్థితి ఎదురైంది. నా తోటి నటుడు తీసుకున్న రెమ్యునరేషన్​లో కేవలం 5శాతం మాత్రమే నాకు ఇచ్చారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆ సమయంలో ఇద్దరికీ సమాన విజయాలు ఉన్నాయి. ఇద్దరి కెరీర్‌ ఒకేలా ఉంది".
-భూమి పెడ్నేకర్‌, సినీనటి

ఇప్పుడు చలనచిత్ర రంగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని... మహిళా నేపథ్యంతో సాగే చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయని భూమి అభిప్రాయపడింది. ప్రస్తుతం 'డాలీ కిట్టీ ఔర్‌ వో చమక్తే సితారే', 'భూత్‌: పార్ట్‌ వన్‌' చిత్రాల్లో నటిస్తోందీ బాలీవుడ్​ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడు ఇప్పటివరకు ఆయుష్మాన్​ ఖురానా, అక్షయ్​ కుమార్​, సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​, విక్కీ కౌశల్​తో మాత్రమే నటించింది.

గతంలోనూ పారితోషికం విషయంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని... బాలీవుడ్​ తారలు ఆలియా భట్​, సోనమ్​ కపూర్​, అనుష్క శర్మ, దీపికా పదుకొణె, తాప్సీ వంటి అగ్రకథానాయికలు గళమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details