భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'దుర్గావతి'. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ను 'దుర్గామతి'గా మార్చింది చిత్రబృందం. తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోలో.. భూమి నటన విపరీతంగా ఆకట్టుకుంటోంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తోంది.
'అనుష్క' పాత్రలో భూమి పెడ్నేకర్.. ట్రైలర్ విడుదల - భూమి పెడ్నేకర్ దుర్గావతి ట్రైలర్
అగ్రకథానాయిక అనుష్క శెట్టి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది భూమి పెడ్నేకర్. ఈ బాలీవుడ్ హీరోయిన్ నటించిన దుర్గామతి ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ఇది తెలుగు చిత్రం భాగమతికి రీమేక్‌గా తెరకెక్కింది.
!['అనుష్క' పాత్రలో భూమి పెడ్నేకర్.. ట్రైలర్ విడుదల bhumi pednekar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9658921-346-9658921-1606291371850.jpg)
'అనుష్క' పాత్రలో భూమి ఫెడ్నేకర్.. ట్రైలర్ విడుదల
తెలుగులో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'భాగమతి'కి హిందీ రీమేక్ ఇది. మాతృకను తెరకెక్కించిన అశోక్ హిందీ ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. 'టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ' తర్వాత అక్షయ్ నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా డిసెంబరు 11న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కానుంది.