తన 27వ పుట్టినరోజును స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకొంది బాలీవుడ్ నటి ఆలియాభట్. రెండు కేక్‌లు ఒకేసారి కట్ చేస్తూ సందడి చేసింది. ఆ వీడియోలను ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బాలీవుడ్లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో అరంగేట్రం చేసింది ఆలియా. వరుస విజయాలు సాధిస్తూ, స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే 1999లోనే వచ్చిన 'సంఘర్ష్' సినిమాలో కథానాయిక ప్రీతిజింటా చిన్నప్పటి పాత్రలో కనిపించిందీ ఈమె. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో పాటు 'బ్రహ్మాస్త్ర', 'గంగూబాయ్' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.