పిట్ట కొంచెం కూత ఘనం అన్న మాటకు సరిగ్గా సరిపోతుంది ఆలియా భట్. మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే నైజం ఆమె సొంతం. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో పేరు తెచ్చుకుంది. సినిమాసినిమాకూ వైవిధ్యం ప్రదర్శించి స్టార్ నాయికగా మారింది. ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాత మహేశ్ భట్ వారసురాలిగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. బాల్యంలో ఆలియా అప్పుడప్పుడు వాళ్ల నాన్న తెరకెక్కించే చిత్రాల సెట్స్‌కి వెళ్లేది. ఎవరైనా.. నటుల్ని చూసేందుకు, అందమైన లొకేషన్లు చూసేందుకు, షూటింగ్ ఎలా చేస్తారో తెలుసుకునేందుకు వెళ్తారు. కానీ, ఆలియా మాత్రం తినడానికి వెళ్లేదట.
Alia Bhatt: ఆలియా సెట్‌కు ఎందుకు వెళ్లేదో తెలుసా? - movie news
సినిమా సెట్స్‌కి ఎవరైనా ఎందుకు వెళ్తారు? లొకేషన్లను, నటుల్ని చూడటానికి అని ఎవరైనా అనుకుంటారు. కానీ మన స్టార్ కథానాయిక ఆలియా భట్ మాత్రం తినడానికి వెళ్లేదట. ఎందుకో తెలుసుకుందామా?
అక్కడైతే చాలా రకాల ఆహార పదార్థాలు ఉంటాయని, ఎంచక్కా వాటన్నింటినీ తినేయొచ్చనేది అప్పట్లో ఆలియా ఉద్దేశం. ఓ సందర్భంలో ఈ విషయాన్ని తలచుకుంటూ నవ్వులు పంచింది ఆలియా. ఆహారం విషయంలో ఆలియా మొహమాటపడదనే విషయం తెలిసిందే. వేరు శనగలు, గ్రీన్ టీ అంటే ఆలియాకు బాగా ఇష్టం. ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర', 'గంగూబాయి కతియావాడి' అనే హిందీ చిత్రాల్లో నటిస్తోంది. 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో రామ్ చరణ్‌కి జోడీగా కనిపించనుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది.
ఇదీ చదవండి:రెండు రోజుల్లో ఓకే చెప్పేశా: ప్రియా ప్రకాశ్ వారియర్