తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ రాజ్​పుత్​ చివరి ఎమోషనల్​ పోస్ట్​ - సుశాంత్​ రాజ్​పుత్​ చివరి ఎమోషనల్​ పోస్టు

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ చివరిసారిగా ఇన్​స్టాగ్రామ్​లో తన తల్లి గురించి ఓ భావోద్వేగ పోస్ట్​ను షేర్​ చేశారు.

Bollywood Actor Sushant Singh Rajput Last Emotional Post in Instagram
సుశాంత్​ రాజ్​పుత్​ చివరి ఎమోషనల్​ పోస్టు

By

Published : Jun 14, 2020, 7:10 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ (34) హఠాన్మరణం చెందారు. ఆదివారం మధ్యాహ్నం ముంబయిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నటుడు ఇన్​స్టాగ్రామ్​లో చివరిగా తన తల్లి గురించి ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. సుశాంత్​ తన తల్లి ఫొటోను షేర్​ చేస్తూ.. "కన్నీళ్లతో తన గతాన్ని మరిచి.. చిరునవ్వుతో కలలను సాకారం చేసుకోవాలనుకుంటూ.. ఇలా ఈ రెండింటి మధ్య చిన్న జీవితాన్ని గడిపింది. ఆమె మా అమ్మ" అంటూ జూన్​ 3వ తేదీన పోస్టు చేశారు.

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణంపై సోషల్​మీడియాలో పలువురు బాలీవుడ్​ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 'ధోనీ: అన్​టోల్డ్​​ స్టోరీ' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుశాంత్​.. గతేడాది విడుదలైన 'చిచ్చోరే', 'సోన్​చిరియా', 'డ్రైవ్​' చిత్రాలతో అలరించారు.

ఇదీ చూడండి... బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details