బాలీవుడ్ సీనియర్ నటుడు, భాజాపా ఎంపీ సన్నీ దేఓల్కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ హెల్త్ సెక్రటరీ స్పష్టం చేశారు. ఇటీవల ఆయన భుజానికి సర్జరీ కాగా కొంతకాలంగా ఆయన కులు జిల్లాలోని మనాలీలో ఉన్న తన ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
సన్నీ దేఓల్కు కరోనా పాజిటివ్ - bollywood actor sunnydeol corona positive
బాలీవుడ్ ప్రముఖ నటుడు, భాజపా ఎంపీ సన్నీ దేఓల్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ హెల్త్ సెక్రటరీ స్పష్టం చేశారు.
సన్నీ
ప్రేమకథలతో మొదలుపెట్టి యాక్షన్ స్టార్‌గా మారారు సన్నీ. తెరపై తప్ప బయట ఎక్కువగా కనిపించని ఆయనకు ఉత్తర భారతంలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగానే కాకుండా నిర్మాతగా, అభిరుచిగల దర్శకుడిగానూ విజయాలందుకున్నారు. ప్రస్తుతం ఎంపీగా గెలిచి ఆయన తండ్రి దిగ్గజ నటుడు ధర్మేంద్ర రాజకీయ వారసత్వాన్నీ కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి :తూ ఖాన్ హై తో మై సన్నీ.. బాలీవుడ్ నరసింహా