ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పొలం దున్నడానికి ఎద్దులను అద్దెకు తీసుకునేందుకు స్థోమత లేక.. తన కుమార్తెలతో కాడి మోయించిన వీడియో అందరి మనసులను కదిలించింది. ఈ విషయాన్ని ఓ రిపోర్టర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కరోనాతో భారీ నష్టాల్లో కూరుకుపోయి చేతిలో చిల్లిగవ్వ అయినా లేకపోవడం వల్లే ఈ విధంగా చేయాల్సి వచ్చిందని ఆ రైతు గోడు విన్నవించుకున్నాడు.
రైతు కుటుంబానికి సోనూసూద్ సాయం - రైతుకు సాయంగా సోనూ సూద్
ఆంధ్రప్రదేశ్లోని ఓ రైతు కుటుంబానికి అండగా నిలిచిన సోనూసూద్.. ఎద్దులు కొనిస్తానని హామీ ఇచ్చారు. కాడి మోస్తున్న అమ్మాయిల్ని చదుకోనివ్వాలని ట్వీట్ చేశారు.
![రైతు కుటుంబానికి సోనూసూద్ సాయం BOLLYWOOD ACTOR SONUSOOD ONCE AGAIN ON NEWS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8177695-280-8177695-1595747120417.jpg)
సోనూ సూద్
ఈ విషయంపై తాజాగా స్పందించిననటుడు సోనూసూద్.. ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సోమవారం(జులై 27) ఉదయం అయ్యేసరికి వారి ఇంటి ముందు ఎద్దుల జత ఉంటుందని ట్వీట్ చేశారు. బాలికలను చదువుపై దృష్టి పెట్టనివ్వాలని తెలిపారు.
లాక్డౌన్ కారణంగా పలు ఊళ్లలో చిక్కుకున్న వేలాది మంది వలస కూలీలకు ఇప్పటికే సాయంగా చేశారు సోనూసూద్. వారిని స్వస్థలాలకు చేర్చుతూ కూలీల పాలిట దైవంగా మారారు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనపై ప్రశంసలు వస్తూనే ఉన్నాయి.
Last Updated : Jul 26, 2020, 2:18 PM IST