తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షారుఖ్​, అట్లీ సినిమాకు 'సంకి' పేరు ఫిక్స్​..! - Tamil movie news, Tamil cinema stills, Tamil movie reviews, Tamil cinema reviews, Tamil movie reviews, Tamil actress stills, Tamil cinema wallpapers, Tamil movie HQ photos, Tamil actress hot stills, tollywood, Tamil movies updates

బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్​ ఖాన్‌, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్​లో ఓ సినిమా దాదాపు ఖరారైనట్లు సమాచారం. నవంబర్​ 2న బాద్​షా పుట్టినరోజు సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన రానుందట.

షారుఖ్​, అట్లీ సినిమాకు 'సంకి' పేరు ఫిక్స్​..!

By

Published : Oct 31, 2019, 6:24 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్​ ఖాన్‌.. తమిళ దర్శకుడు అట్లీ కలిసి పనిచేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్​లో త్వరలో ఓ చిత్రం పట్టాలెక్కనుందట. దీనికి 'సంకి' అనే పేరు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కింగ్ ఖాన్ పుట్టినరోజైన నవంబర్​ 2న అధికారిక ప్రకటన వెలువరించనుంది చిత్రబృందం.

బాలీవుడ్​​ ఎంట్రీ..

గతంలో అట్లీ, షారుఖ్​ కలుసుకున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని కోలీవుడ్‌ వర్గాల్లో చర్చ మొదలైంది. బాలీవుడ్‌కు అట్లీను తీసుకెళ్లాలని బాద్‌షా ప్రయత్నిస్తున్నాడట. విజయ్​ సినిమా 'విజిల్​​'​ తర్వాత ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాలని వీరిద్దరూ అనుకున్నట్లు సమాచారం.

షారుఖ్​ తమిళ సినిమాలో నటించడం ఇదేమి తొలిసారి కాదు. 'హే రామ్‌' సినిమాలో కమల్‌ హాసన్‌ సోదరుడి పాత్రను పోషించాడు. దక్షిణాదిలో జరిగే పలు వేడుకలకు షారుఖ్​ హాజరవుతుంటాడు. గతంలో ఇతడు తీసిన 'చెన్నై ఎక్స్​ప్రెస్​' సినిమాలో రజినీ పేరుతో పాట పెద్ద హిట్టయింది. దర్శకుడిగా అట్లీ విజయవంతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన తీసిన నాలుగు సినిమాలు 'రాజా రాణి', 'తెరి', 'మెర్సల్‌', 'విజిల్​' ప్రేక్షకాదరణ పొందాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details