ముంబయి, పాక్ ఆక్రమిత కశ్మీర్ అని సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న నటి కంగనా రనౌత్. డ్రగ్స్ కేసు విషయమై మాట్లాడుతూ సెప్టెంబరు 9న ముంబయి వస్తానని చెప్పింది. అప్పటి నుంచి ఆమెకు బెదిరింపులు ప్రారంభమయ్యాయి.
హీరోయిన్ కంగనా రనౌత్‌కు వీఐపీ సెక్యూరిటీ - Kangana Ranaut Y+ category security
తనకు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కేటాయించడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపింది నటి కంగనా రనౌత్.
![హీరోయిన్ కంగనా రనౌత్‌కు వీఐపీ సెక్యూరిటీ Bollywood actor Kangana Ranaut given Y+ category security by central agencies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8708521-567-8708521-1599458807355.jpg)
నటి కంగనా రనౌత్
ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ, కంగనకు 'వై ప్లస్' కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ట్వీట్ చేస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు చెప్పిందీ నటి. సెక్యూరిటీ సిబ్బందిలో 10 మంది కమాండోలు సహా రక్షణ కోసం ఓ వ్యక్తి ఉంటారు.