కోలీవుడ్ నటుడు బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా 'డిస్కోరాజా' చిత్రబృందం శుభాకాంక్షలు తెలిపింది. సినిమాలోని అతడి పోస్టర్ను విడుదల చేసింది.బర్మా సేతు అనే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు బాబీ. ఇందులో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తమిళ చిత్రం 'జిగర్తాండ'(తెలుగులో 'గద్దలకొండ గణేశ్') ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు బాబీ సింహా. ఆ సినిమాలో ప్రతినాయకుడిగా మెప్పించాడు. కోలీవుడ్లో తక్కువ కాలంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించాడు. ఈ ఏడాది.. రజనీకాంత్ నటించిన 'పేట' చిత్రంలోనూ కనిపించాడు.