తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పడవలో డార్లింగ్ ప్రభాస్ ప్రేమకథ - prabhas pooja hegde

ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాలోని రొమాంటిక్ సన్నివేశాలు తీసేందుకు ఏకంగా ఓ చెరువు, అందులో పడవనే సృష్టించారు. ప్రస్తుతం హైదరాబాద్​లో చిత్రీకరణ జరుగుతోంది.

పడవలో డార్లింగ్ ప్రభాస్ ప్రేమకథ
డార్లింగ్ ప్రభాస్

By

Published : Feb 11, 2020, 8:31 AM IST

Updated : Feb 29, 2020, 10:49 PM IST

ప్రభాస్‌ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'జిల్‌'తో ప్రతిభ చాటుకున్న రాధాకృష్ణ దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఎస్‌.రవీందర్‌ రెడ్డి ప్రత్యేకమైన సెట్‌ను తీర్చిదిద్దారు. ఎకరం విస్తీర్ణంలో ఓ విశాలమైన చెరువు, అందులో ఓ పడవను సృష్టించారు. ఇందులోనే ప్రభాస్‌ - పూజలపై కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. నాలుగైదు రోజుల పాటు ఇక్కడే షూటింగ్‌ జరగనుంది. ఆ తరవాత రైలు నేపథ్యంలో మరి కొన్ని దృశ్యాల్ని తెరకెక్కిస్తారు.

హీరో ప్రభాస్

యూరప్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. అక్కడే కొంతమేర షూటింగ్‌ జరిగింది. హైదరాబాద్‌లో యూరప్‌ను పోలిన ఇండోర్‌ సెట్లు వేశారు రవీందర్‌. ఈ సినిమాలోని సెట్లు, కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయని చిత్రబృందం చెబుతోంది. 'ఓ డియర్‌', 'రాధే శ్యామ్‌' అనే పేర్లు పరిశీలిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

Last Updated : Feb 29, 2020, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details