ముంబయిలోని తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించింది. తన పొరుగువారిని కూడా వేధిస్తున్నట్లు పేర్కొంది. మంగళవారం ఆ భవనాన్ని కూల్చివేస్తున్నట్లు తనకు సమాచారం ఇచ్చినట్లు నటి వెల్లడించింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా తన ఆఫీసుకు సంబంధించిన వీడియోను పంచుకుంది.
"ఇది ముంబయిలోని 'మణికర్ణిక' సినిమా కార్యాలయం. నేను పదిహేనేళ్లుగా ఇక్కడే కష్టపడ్డా. నేను నిర్మాతనైతే నాకంటూ ఒక ఆఫీసు ఉండాలనేదని నా ఏకైక కల. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా కొంతమంది వచ్చి నా కలను చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నా కార్యాలయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం దానిని కూల్చేస్తారని చెప్పారు."