నేడుబాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్.. కృష్ణ జింకల వేట కేసులో జోధ్‌పూర్ కోర్టు ముందుకు హాజరుకానున్నాడు. అయితే అతడికి గ్యారీ షూటర్ అనే గ్యాంగ్‌స్టర్ నుంచి ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో కోర్టుకు హాజరవుతాడా లేదా అనేది ప్రశ్న.
గతేడాది మేలో ఈ కేసులో సల్మాన్‌కు బెయిల్ ముంజూరైంది. అప్పటి నుంచి కోర్టు మెట్లేక్కలేదు ఈ నటుడు. ఈ ఏడాది జూలై 4న జరిగిన విచారణ సందర్భంగా, సెప్టెంబరు 27న కోర్టు ముందు హాజరు కావాలని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్ర కుమార్ సొరంగా తీర్పిచ్చారు. లేదంటే సల్మాన్‌కు బెయిల్ రద్దవుతుందని చెప్పారు.