తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బ్లాక్​ విడో' ట్రైలర్​.. 'రిపబ్లిక్​' టీజర్ అప్​డేట్​​ - సాయితేజ్​ రిపబ్లిక్​

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'రిపబ్లిక్​' టీజర్​ రిలీజ్​ అప్​డేట్​ సహా 'బ్లాక్​ విడో' ట్రైలర్​, 'వకీల్​సాబ్​' ప్రీ-రిలీజ్ ఈవెంట్​ అప్​డేట్లు ఇందులో ఉన్నాయి.

black widow trailer released
'బ్లాక్​ విడో' ట్రైలర్​.. 'రిపబ్లిక్​' టీజర్ అప్​డేట్​​

By

Published : Apr 4, 2021, 2:02 PM IST

దేవకట్టా దర్శకత్వంలో యువ కథానాయకుడు సాయితేజ్​ హీరోగా నటిస్తున్న చిత్రం 'రిపబ్లిక్​'. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్​ను సోమవారం (ఏప్రిల్​ 5) దర్శకుడు సుకుమార్​ చేతుల మీదుగా ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది.

'రిపబ్లిక్​' టీజర్​ అప్​డేట్

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ ప్రధానపాత్రలో నటించిన 'వకీల్​సాబ్​' చిత్రం ఏప్రిల్​ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్​ను హైదరాబాద్​లోని శిల్పకళా వేదికలో ఆదివారం నిర్వహించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

'వకీల్​సాబ్​' ప్రీ-రిలీజ్​ ఈవెంట్​ పోస్టర్​

హాలీవుడ్​ నిర్మాణసంస్థ మార్వెల్​ స్టూడియోస్​ నిర్మిస్తున్న మరో సూపర్​హీరో చిత్రం 'బ్లాక్​ విడో'. జులై 9న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్రట్రైలర్​ను చిత్రబృందం విడుదల చేసింది.

ఇదీ చూడండి:సౌమిత్రా ఛటర్జీ సతీమణి దీపా మృతి

ABOUT THE AUTHOR

...view details