తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అప్పుడు..ఇప్పుడు.. ఎప్పటికీ 'సూపర్​స్టార్' ఒక్కడే - Rajinikanth 69th Birthday

సూపర్​స్టార్ రజనీకాంత్​ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి అగ్రతారల వరకు తలైవాకు బర్త్​డే విషెస్​ చెబుతున్నారు.

అప్పుడు..ఇప్పుడు.. ఎప్పటికీ 'సూపర్​స్టార్' ఒక్కడే
సూపర్​స్టార్ రజనీకాంత్

By

Published : Dec 12, 2019, 12:08 PM IST

70వ పుట్టినరోజు జరుపుకొంటున్న సూపర్​స్టార్ రజనీకాంత్​కు.. పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్​ సూపర్​స్టార్ మహేశ్​బాబు, దర్శకులు మురుగదాస్, సురేందర్​రెడ్డి, సంగీత దర్శకుడు అనిరుధ్ తదితరులు ఉన్నారు.

"భారత సినిమాకు గర్వకారణమైన వన్ అండ్ ఓన్లీ సూపర్​స్టార్ రజనీకాంత్​కు జన్మదిన శుభాకాంక్షలు" -సన్​ పిక్చర్స్, నిర్మాణ సంస్థ

"మా తలైవా రజనీకాంత్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో మీకు ఈ ఏడాది సాగాలని కోరుకుంటున్నా" -మహేశ్​బాబు, హీరో

"ప్రపంచంలో నేను అమితంగా ఇష్టపడే సూపర్​స్టార్ రజనీకాంత్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికీ సూపర్​స్టార్ ఒక్కడే. ఆయనే రజనీకాంత్" -అనిరుధ్ రవిచందర్, సంగీత దర్శకుడు

"హ్యాపీ బర్త్​డే మై లైఫ్.. మై ఫాదర్.. మా నాన్న" -సౌందర్య రజనీకాంత్, దర్శకురాలు

"పుట్టినరోజు శుభాకాంక్షలు తలైవా రజనీకాంత్ సర్. మీరెప్పటికీ విజయాలు, ఆరోగ్యం, ఆనందంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా అందరికీ మీరు స్ఫూర్తి. మీ ప్రయాణంలో నేనో భాగమైనందుకు చాలా ఆనందిస్తున్నాను" -ఏఆర్ మురుగదాస్, దర్శకుడు

"వన్​ అండ్ ఓన్లీ సూపర్​స్టార్ రజనీకాంత్​ సర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. 'దర్బార్'​కు ఆల్​ ద బెస్ట్" -సురేందర్​రెడ్డి, దర్శకుడు

ఇవీ చదవండి:

'ఏరా నీకంత పొగరా' అని రజనీపై కోప్పడిన నిర్మాత!

రజనీ బర్త్​డే: కనిపిస్తే రికార్డులు.. నడిచొస్తే రివార్డులు..!

ఇండస్ట్రీలో 44 ఏళ్లు.. అప్పటికీ ఇప్పటికీ స్టైల్ అదే

ABOUT THE AUTHOR

...view details