ప్రతి ఒక్కరి హృదయాల్లో డార్లింగ్.. మన ప్రభాస్ - celebs pour in wishes to Prabhas
డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆయన మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.

ప్రతి ఒక్కరి హృదయాల్లో డార్లింగ్.. మన ప్రభాస్
'ఈశ్వర్' చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి, పాన్ ఇండియన్ నటుడిగా అందరి చేత ప్రశంసలు అందుకుంటున్న హీరో డార్లింగ్ ప్రభాస్. శుక్రవారం ఆయన 41వ పుట్టినరోజు. ప్రస్తుతం 'రాధేశ్యామ్' షూటింగ్ నిమిత్తం ఇటలీలో ఉన్న ప్రభాస్‌కు.. వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్, శ్రీనువైట్ల, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల, సురేందర్ రెడ్డి, రాశీఖన్నా, తమన్నా, సుశాంత్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
- మన నిజమైన రాజు బాహుబలికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ ప్రతి ప్రాజెక్ట్ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాం - బాహుబలి టీమ్
- బ్రదర్ హ్యాపీ బర్త్ డే. చేయబోయే ప్రతి పనిలో నీకు మంచి మాత్రమే జరగాలి - రానా
- ఇండియన్ బాక్సాఫీస్‌ను ఆయన జయించాడు. ఇప్పుడు వరుసలో ప్రపంచ బాక్సాఫీస్ ఉంది. రెబల్‌స్టార్ లేదా పాన్ ఇండియన్ స్టార్ ఇలా ఎన్నో పేర్లతో మనం పిలిచినప్పటికీ ఆయన మాత్రం ప్రతి ఒక్కరి హృదయాల్లో డార్లింగ్. భవిష్యత్తులో ఆయనకు అంతా మంచే జరగాలి - మారుతి
- ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మంచి మనస్సున్న డార్లింగ్ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు చేయబోయే ప్రతి సినిమాకు ఆల్ ది బెస్ట్ - నితిన్
- డార్లింగ్, రెబల్‌స్టార్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. 'ఈశ్వర్' నుంచి ప్రారంభమై పాన్ ఇండియా సూపర్‌స్టార్ స్థాయికి చేరుకున్న మీ ప్రయాణం ఎంతోమందికి ఆదర్శం. రానున్న రోజుల్లో మీరు మరిన్ని విజయాలు అందుకుని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను - శ్రీవిష్ణు
- వెరీ హ్యాపీ బర్త్‌డే సూపర్ కూల్ డార్లింగ్ ప్రభాస్. రాధేశ్యామ్ కోసం ఎదురుచూస్తున్నా. ఎప్పటిలానే ఆ సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నాను - బాబీ
- మిలియన్ల మందికి డార్లింగ్, నా 'బిల్లా' ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు - మెహర్ రమేశ్
- హ్యాపీ బర్త్‌డే ప్రభాస్. ఈ సంవత్సరమంతా నీకు సూపర్‌గా ఉండాలని కోరుకుంటున్నా. మీ స్టార్‌డమ్ అంతకంతకు పెరుగుతూనే ఉండాలి - రకుల్ ప్రీత్ సింగ్
Last Updated : Oct 23, 2020, 1:36 PM IST