తెలంగాణ

telangana

ETV Bharat / sitara

pawankalyan Birthday: నెట్టింట వెల్లువెత్తిన 'పవనోత్సవం' - పవన్​ కల్యాణ్ 50వ పుట్టిన రోజు

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్​(Power star Pawan Kalyan)కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవన్​ 50వ పుట్టినరోజును (Happy Birthday Pawan Kalyan) పురస్కరించుకుని మెగా ఫ్యామిలీ సహా సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు.. పవన్​కు బర్త్​డే విషెస్ తెలిపారు.

Happy Birthday Pawan Kalyan
పవర్‌స్టార్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

By

Published : Sep 2, 2021, 12:48 PM IST

Updated : Sep 2, 2021, 1:03 PM IST

తన తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Power star Pawan Kalyan) పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పుకణమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పవన్‌ 50వ పుట్టినరోజును (Happy Birthday Pawan Kalyan)పురస్కరించుకుని ఆయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో దిగిన ఫొటోలు షేర్‌ చేసిన చిరు.. తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. చిరుతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

పవర్‌స్టార్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

"చిన్నప్పటి నుంచి సమాజం గురించే కల్యాణ్‌ ఆలోచన.. ప్రతి అడుగు.. పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం.. కల్యాణ్‌. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు."

- చిరంజీవి

"పవన్‌కల్యాణ్‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను."

-తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై

"సినీ కథానాయకులు, ప్రజా నాయకులు పవన్‌కల్యాణ్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నా."

- చంద్రబాబు నాయుడు

"ప్రతి చోట.. ప్రతి విషయంలో స్టార్‌.. బంగారం లాంటి మనస్సున్న వ్యక్తి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ నుంచి మరెన్నో సినిమాలు రావాలి.. మా అందర్నీ ఇంకెంతగానో అలరించాలి అని కోరుకుంటున్నా."

- రాఘవేంద్రరావు

రాఘవేంద్రరావుతో పవన్​ కల్యాణ్​

"హ్యాపీ బర్త్‌డే మై పవన్‌కల్యాణ్‌. ఈ రోజుతోపాటు రానున్న ఏడాదంతా మీకు సంతోషం, ఆనందం కలగాలని కోరుకుంటున్నా."

- అల్లు అర్జున్‌

"నా ఆప్తమిత్రుడు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా."

- రవితేజ

"నిజం, నిజాయతీ, సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం. పరిశ్రమలో నాకెంతో ఇష్టమైనవారిలో ఒకరైన పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు."

- వక్కంతం వంశీ

"హ్యాపీ బర్త్‌డే కల్యాణ్‌ బాబాయ్‌..!! నీ మాటలతో రేపు అనేది ఎంతో ఆనందంగా, అందంగా ఉంటుందనే నమ్మకం మాలో కలుగుతుంది. నువ్వు ఎప్పటికీ ఓ స్ఫూర్తిప్రదాత. ఎల్లప్పటికీ నీ వెంటే ఉంటా."

- నిహారిక కొణిదెల

పవన్​ కల్యాణ్​తో నిహారిక

"హ్యాపీ బర్త్‌డే బాబాయ్‌!! అన్నింటిలో నీకు మంచే జరగాలని.. విజయం వరించాలని కోరుకుంటున్నా."

- వరుణ్‌ తేజ్‌

"మన పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. దేనికి తలొగ్గకూడదు అనేదాన్ని మీ నుంచి నేర్చుకున్నా. మీరు మాలో నింపిన స్ఫూర్తికి ధన్యవాదాలు"

- బాబీ

"ఒక నటుడిగా, నాయకుడిగా ఎన్నో మిలియన్ల మందిలో స్ఫూర్తి, ప్రేరణ నింపిన మోస్ట్‌ పవర్‌ఫుల్‌ మ్యాన్‌, ప్రియమైన సోదరుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు"

- మెహర్‌ రమేశ్‌

పవన్​ కల్యాణ్​తో మెహర్​ రమేష్​

"నా గురువు, ధైర్యమైన పవన్‌కల్యాణ్‌ మామకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించాలి"

- సాయిధరమ్‌ తేజ్‌

"ఈ ప్రత్యేకమైన రోజున పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు ఆయురారోగ్యాలు సొంతం కావాలని ప్రార్థిస్తున్నాను. ఆ నవ్వు.. ఆ ధైర్యం.. ఆ పవర్‌.. ఎంతో మందిలో స్ఫూర్తినింపింది!! మా సపోర్ట్, ప్రేమాభిమానం మీ వెంటే ఉంటుంది"

- సంపత్‌ నంది

ఇదీ చూడండి:'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కుమ్మేసింది!

Last Updated : Sep 2, 2021, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details