తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెండితెరపై ప్రపంచ ఛాంపియన్​ ఆనంద్​ బయోపిక్​

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్​ వెండితెరపై రానుంది. దీన్ని బాలీవుడ్ ప్రముఖ ​దర్శకుడు ఆనంద్​ ఎల్​ రాయ్​ తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Anand
ఆనంద్​

By

Published : Dec 13, 2020, 2:31 PM IST

ప్రపంచ మాజీ ఛాంపియన్​, చెస్​ ప్లేయర్​ విశ్వనాథన్​ ఆనంద్​ జీవిత చరిత్రను త్వరలోనే వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు ఆనంద్​ ఎల్​ రాయ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రణాళికలు రచిస్తున్నారు. ఆనంద్​ కెరీర్​కు సంబంధించిన ప్రతి అంశాన్ని, జీవితంలో ఆయన ఎదుర్కొన్న ప్రతి సంఘటనను తెరపై చూపించనున్నారు. రాయ్​.. అంతకుముందు 'తను వెడ్స్​ మను', 'రాంఝానా' సినిమాలను తెరకెక్కించారు.

విశ్వనాథన్​ ఆనంద్​.. మెదడుకు పదునెక్కువ.. ఆలోచనలకు వేగం ఎక్కువ. ఆయన వ్యూహాలకు ప్రత్యర్థులు చేతులెత్తేస్తారు. ఆరేళ్ల వయసులోనే ఆనంద్​ చెస్​ ఆడటం ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి ఈ ఆటలో దిగ్గజ స్థాయికి ఎదిగారు. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్​గా అవతరించి.. చదరంగం క్రీడలో ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నారు. గతేడాది డిసెంబరులో 'మైండ్ మాస్టర్' పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమంలో తన బయోపిక్​లో ఆమిర్ ఖాన్ నటిస్తే బాగుంటుందని చెప్పారు ఆనంద్​.

ఇదీ చూడండి : నా బయోపిక్​లో ఆమిర్ నటించాలి: విశ్వనాథన్ ఆనంద్

ABOUT THE AUTHOR

...view details