*కల్యాణ్‌రామ్ 'బింబిసార' నుంచి అప్డేట్ వచ్చింది. సినిమా టీజర్‌ను నవంబరు 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సోషియో ఫాంటసీ నేపథ్య కథతో ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కల్యాణ్‌రామ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. వశిష్ఠ్ సింహా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా.. డిసెంబరులో లేదా సంక్రాంతి తర్వాత థియేటర్లలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
*సిద్దార్థ్ మల్హోత్రా కొత్త సినిమా షూటింగ్ శనివారం ప్రారంభమైంది. 'యోధ' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ ఆంబ్రే-పుష్కర్ ఓజా ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది నవంబరు 11న థియేటర్లలోకి రానుంది.
*'విరాటపర్వం' షూటింగ్ ఇంకా 5-10 రోజులు మిగిలి ఉందని నిర్మాత సురేశ్ బాబు వెల్లడించారు. ఈ సినిమాకు మరో నిర్మాత కూడా ఉన్న నేపథ్యంలో, ఆయనతో చర్చించి చిత్ర విడుదల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు.