తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Bimbisara: కల్యాణ్​ రామ్ హై లెవల్ స్కెచ్! - బింబిసార ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

కల్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'బింబిసార'(Bimbisara). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారట.

bimbisara
బింబిసార

By

Published : Jun 12, 2021, 7:22 PM IST

కల్యాణ్‌ రామ్‌(Kalyan Ram) ప్రధానపాత్రలో నటిస్తున్న 'బింబిసార'(Bimbisara) భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మగధ సామ్రాజ్యంలోని హర్యంక రాజవంశ రాజు బింబిసారుడి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కేథరిన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్లు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారట.

తొలుత ఒక భాగంలోనే కథ మొత్తం వివరించాలని భావించినా.. మూడు భాగాల్లో అయితే బాగుంటుందని దర్శక-నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. అలా అయితే కథకు న్యాయం చేయగలమనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. అందుకోసం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయట. ఈ సినిమాకు చిరంతన్‌ భట్‌ సంగీతం సమకూర్చనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్!

తన సోదరుడు కల్యాణ్‌రామ్‌ చిత్రంలో ఎన్టీఆర్‌(NTR) భాగం కావాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్న తారక్‌ 'బింబిసార' చిత్రానికి తన వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అయితే.. దీనికి సంబంధించి చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మరి ఈ వార్తల్లో ఏ మేరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే మరి. అంతేకాదు.. సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ తారక్‌ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ప్రేమ వ్యవహారం బహిర్గతం.. కలత చెందిన కత్రిన

ABOUT THE AUTHOR

...view details