సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. మన దేశంతో పాటు అమెరికా, జపాన్, మలేషియా తదితర దేశాల్లోనూ రజనీ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడి చిత్రాలతో పోటీ పడి భారీ వసూళ్లను సైతం కొల్లగొట్టేస్తాయి. ఇలాంటి రజనీ సరసన నటించాలని ఎంతో మంది కథానాయికలు కలలు కంటుంటారు. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఆయన సినిమాలో చిన్న పాత్ర దక్కినా చేసేందుకు ప్రతి నటుడు సిద్ధంగా ఉంటాడు. రోబో 2.ఓలో అక్షయ్ కుమార్ కూడా రజనీకి ప్రతినాయకుడిగా నటించాడు. అయితే తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటుడు 'బిల్ డ్యూక్' రజనీ సినిమా నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు.
తనకు రజనీకాంత్ చిత్రంలో నటించేందుకు అవకాశమివ్వాలంటూ... రజనీతో పాటు దర్శకుడు మురుగదాస్‌కు ట్వీట్ చేశాడు డ్యూక్.
‘" మురుగదాస్.. నాకు తమిళం రాదు. కానీ, నేను రజనీకాంత్ సోదరుడి పాత్రలో కానీ నయనతారకు అంకుల్ పాత్రలోనైనా నటిస్తాను. అనిరుధ్ రవిచందర్ మాలాంటి స్టార్ నటుల కోసం ఓ మంచి పాటను కూడా కంపోజ్ చేస్తే బాగుంటుంది. ఏమంటారు?"
- బిల్ డ్యూక్