తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బికినీతోనే అరంగేట్రం! - introduction to telugu secreen

సందీప్​ కిషన్​ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. ఇందులో కథానాయికగా నటిస్తోన్న అన్య సింగ్​ ఫోటోలను చిత్రబృందం విడుదల చేసింది. తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతూనే బికినీతో కనిపించనుంది.

బికినీతోనే అరంగేట్రం!

By

Published : Feb 13, 2019, 11:55 AM IST

Updated : Feb 13, 2019, 12:10 PM IST

సందీప్​ కిషన్​ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. హర్రర్​, సెంటిమెంట్​ ప్రధానాంశాలుగా వస్తోందీ చిత్రం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు ద‌ర్శకుడు. తమన్‌ బాణీలు అందించారు. ఈ చిత్రంతో బాలీవుడ్​ నటి అన్య సింగ్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆమె ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

యశ్​​రాజ్​ ఫిలింస్​ తొలి అవకాశం:

అన్యసింగ్ మొదట బాలీవుడ్​లో అరగేట్రం చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ యశ్​రాజ్ ఫిలింస్ రూపొందించిన... 'ఖైదీ బ్యాండ్' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా అన్యకు మంచి పేరు వచ్చింది. సందీప్​కు జోడీగా: డిగ్రీ తర్వాత సినీ రంగంపై దృష్టిపెట్టింది అన్య. ఆ సమయంలో యష్​రాజ్ ఫిలింస్ ఇచ్చిన ఆఫర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా టాలీవుడ్‌లో సందీప్ కిషన్ సరసన అవకాశం దక్కించుకొంది.

వావ్​ అనిపించిన ఫస్ట్​లుక్​​:

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పగిలిన అద్దంపై సందీప్‌...చుట్టూ రక్తం ఉన్న ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ ఫస్ట్‌లుక్‌ చాలా బాగుందని సినీ ప్రముఖులు రకుల్‌ప్రీత్‌ సింగ్‌, తమన్నా, సుధీర్‌బాబు, ప్రియదర్శి, ఫణి కందుకూరి ట్వీట్లు చేశారు.

Last Updated : Feb 13, 2019, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details