అట్లీ దర్శకత్వంలో తమిళ అగ్రనటుడు విజయ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'బిగిల్'. తెలుగులో ఈ సినిమా 'విజిల్' పేరుతో విడుదలవుతుంది. నయనతార కథానాయిక. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
ఈ చిత్రంలో విజయ్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. ట్రైలర్లో నయనతార, విజయ్ మధ్య వచ్చే సీన్స్ కనువిందు చేస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయంలో దర్శనమివ్వబోతున్నాడు. బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.