తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినిమా రంగం నుంచి 'బిగిల్‌' ఒక్కడే - vijay bigil

ఈ ఏడాది భారత్​లో అత్యధికంగా ట్రెండింగ్​లో నిలిచిన తొలిపది హ్యాష్​ట్యాగ్​లలో విజయ్ 'బిగిల్' స్థానం సంపాదించింది. ఈ వార్తతో అభిమానులు మరోసారి 'బిగిల్​'ను ట్రెండింగ్ చేస్తున్నారు.

సినిమా రంగం నుంచి 'బిగిల్‌' ఒక్కడే
బిగిల్ సినిమాలో హీరో విజయ్

By

Published : Dec 10, 2019, 7:32 PM IST

2019 క్లైమాక్స్‌కు వచ్చేశాం. నూతన సంవత్సర వేడుకలకు ఉన్నదిమరికొద్ది రోజుల్లో. సినిమా ప్రచారాలు ఈ సంవత్సరం కొత్త ఒరవడిని చూశాయి. అంతర్జాలం సాధారణ మనిషికి మరింత చేరువైంది. సినిమా, రాజకీయాలు, క్రీడలు ఎటువంటి సమాచారం అయిన సామాజిక మాధ్యమాల ద్వారానే అందరికి చేరువవుతున్నాయి. ఈ సంవత్సరం అత్యధికంగా ట్వీట్స్‌ పొందిన పది హ్యష్‌ట్యాగ్‌లలో సినిమా రంగం నుంచి విజయ్‌ 'బిగిల్‌'(తెలుగులో విజిల్) మాత్రమే చోటు సాధించింది. టాప్-10లో నిలిచింది. ట్విట్టర్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు మరోసారి 'బిగిల్‌' హ్యష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌ చేస్తున్నారు విజయ్ అభిమానులు.

అయితే ఇందులో బాలీవుడ్‌ చిత్రాలు ఒక్కటి స్థానం సంపాదించలేకపోయాయి. ఈ ఏడాది అత్యధికంగా హ్యష్‌ట్యాగ్‌లు పొందిన అంశాలు లోక్‌సభ ఎన్నికలు, చంద్రయాన్, క్రికెట్‌ ప్రపంచకప్, ఆర్టికల్‌ 370, అయోధ్య, దీపావళి మిగతా వరుస క్రమంలో ఉన్నాయి.

ఇది చదవండి: శంకర్​ దర్శకత్వంలో విజయ్ మరోసారి?

ABOUT THE AUTHOR

...view details