తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో విజయ్​కు రెండోసారి ఆ అవకాశం..! - 'సాహో' వార్తలు

హీరో విజయ్ 'బిగిల్' చిత్రం ట్విట్టర్​లో ఎమోజీ సింబల్ దక్కించుకుంది. ఇంతకు ముందు ఇదే కథానాయకుడు నటించిన మెర్సల్​(అదిరింది) ఈ ఘనత సాధించింది.

హీరో విజయ్​కు రెండోసారి ఆ అవకాశం..!

By

Published : Oct 23, 2019, 4:31 PM IST

Updated : Oct 23, 2019, 6:50 PM IST

కోలీవుడ్​ టాప్ హీరో విజయ్​ నటించిన చిత్రం 'బిగిల్'. తెలుగులో 'విజిల్' పేరుతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్విట్టర్​లో ఎమోజీ సింబల్​ను​ సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఇదే కథానాయకుడు నటించిన మెర్సల్(అదిరింది).. ఈ ఘనత అందుకుంది. తమిళంలో మెర్సల్, కాలా, ఎన్​జీకె సినిమాలకు ఎమోజీలు వచ్చాయి. తెలుగులో 'సాహో' ఈ ఘనత అందుకున్న తొలి సినిమా.

బిగిల్ మూవీ ఏమోజీ

ఫుట్​బాల్​ నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నయనతార హీరోయిన్​. ఏఆర్.రెహమాన్ సంగీతమందించాడు. అట్లీ దర్శకత్వం వహించాడు. ఇంతకు ముందుకు అట్లీ-విజయ్ కాంబినేషన్​లో తెరి(పోలీసోడు), మెర్సల్(అదిరింది) వచ్చాయి. ఈ రెండు ప్రేక్షాకాదరణ పొందాయి.

ఇది చదవండి: ఆ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం 'సాహో'

Last Updated : Oct 23, 2019, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details