తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాగల 24గంటల్లో.. అందరిచూపు.. టాలీవుడ్​వైపు - సలార్ షూటింగ్

టాలీవుడ్​ నుంచి పెద్ద చిత్రాల క్రేజీ అప్​డేట్స్ రానున్న 24 గంటల్లో​ అభిమానులను పలకరించనున్నాయి. 'ఆచార్య' టీజర్​, ప్రభాస్​-నాగ్అశ్విన్​ సినిమా అప్​డేట్​తో సహా 'సలార్​' షూటింగ్​ కబుర్లు రానున్నాయి.

biggest announcements coming from tollywood
రాగల 24గంటల్లో.. అందరిచూపు.. టాలీవుడ్​వైపు

By

Published : Jan 28, 2021, 7:00 PM IST

ఎన్నో అద్భుతమైన, ప్రతిష్ఠాత్మకమైన చిత్రాలను సినీలోకానికి అందించిన తెలుగు చిత్రపరిశ్రమ నుంచి మరికొన్ని గంటల్లో కొన్ని ఆసక్తికర విశేషాలు బయటకు రానున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియుల చూపు ఇప్పుడు టాలీవుడ్‌పై ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా గతేడాది వాయిదా పడిన పలు భారీ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్‌లు.. కొత్త సినిమా షూటింగ్స్‌ ఆరంభంతో శుక్రవారం టాలీవుడ్‌లో పండగ వాతావరణం నెలకొననుంది. ఇప్పటికే 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'పుష్ప' విడుదల తేదీల ప్రకటనలతో ఫిదా అయిన నెటిజన్లు.. రేపటి రోజున రానున్న మరిన్ని అప్‌డేట్స్‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ శుక్రవారం విడుదల అలరించనున్న అప్‌డేట్స్‌ ఏమిటంటే..

'ధర్మస్థలి' తలుపులు తెరుచుకోనున్నాయ్‌..

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న 'ఆచార్య' టీజర్‌ను శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ధర్మస్థలి తలుపులు తెరుచుకోనున్నాయని కొరటాల శివ తెలిపారు. చరణ్‌ వాయిస్‌ఓవర్‌తో టీజర్‌ విడుదల ఉండనుందని ఇప్పటికే బయట టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు నయనతార కథానాయికగా నటిస్తున్న ఇందులో పూజాహెగ్డే అతిథిపాత్రలో కనిపించనున్నారు.

నాగ్‌ అశ్విన్‌-ప్రభాస్‌ అప్‌డేట్‌ ఏమై ఉంటుందో..

'బాహుబలి', 'సాహో' తర్వాత ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనతో ప్రాజెక్ట్‌లు చేసేందుకు దర్శకులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే రాధాకృష్ణతో 'రాధేశ్యామ్‌', ఓంరౌత్‌తో 'ఆదిపురుష్‌', ప్రశాంత్‌నీల్‌తో 'సలార్‌' సినిమాలకు ఓకే చెప్పిన ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌తో ఓ పాన్‌ ఇండియన్‌ మూవీకి సంతకం చేశారు. అయితే నాగ్‌అశ్విన్‌-ప్రభాస్‌ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ కేవలం కొన్ని ప్రకటనలు మాత్రమే బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ విడుదల చేస్తానని నాగ్‌ అశ్విన్‌ మాటిచ్చారు.

ప్రభాస్​, అశ్వనీదత్​, నాగ్​అశ్విన్​

పట్టాలెక్కనున్న 'సలార్‌'

కన్నడ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌-ప్రభాస్‌ కాంబోలో రానున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌'. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకొన్న ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. గోదావరిఖనిలోని బొగ్గుగనుల్లో జరగనున్న చిత్రీకరణలో ప్రభాస్‌-శ్రుతిహాసన్‌ పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మొత్తం ఆరు యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉంటాయని తెలుస్తోంది.

ప్రశాంత్​ నీల్​, ప్రభాస్​

ఇదీ చూడండి:ఆ పెళ్లిలో అవమానం జరిగింది.. ఏడ్చేశా: షకీలా

ABOUT THE AUTHOR

...view details