తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కల్లు తాగిన బిగ్​బాస్​ బ్యూటీ.. 'అఖండ' స్టైల్​లో! - బిగ్​బాస్​ హిమజ రీల్స్​

Biggboss Himaja: బిగ్‌బాస్ ఫేమ్, నటి హిమజ తరచూ ఇన్‌స్టా రీల్స్, ఫోటోషూట్స్‌.. నిత్యం సోషల్​మీడియాలో ఫ్యాన్స్​తో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ భామ కల్లు తాగుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

himaja
bigboss himaja

By

Published : Mar 16, 2022, 4:41 PM IST

Biggboss Himaja: బిగ్‌బాస్‌ బ్యూటీ​, నటి హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మోడలింగ్‌తో కెరీర్‌ ప్రారంభించిన ఈ భామ.. ఆ తర్వాత సీరియల్స్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. కొన్నాళ్లకు బుల్లితెరకు గుడ్‌బై చెప్పి వెండితెరపై అవకాశాలు దక్కించుకుంది. సినిమాల్లో హీరోయిన్ పక్కన స్నేహితురాలి పాత్రలో ఎక్కువగా కనిపించిన నటి హిమజ.. బిగ్‌బాస్‌ తర్వాత మరింత పాపులర్‌ అయ్యింది.

కల్లు తాగుతున్న హిమజ

Bigboss Himaja Latest Reel: బిగ్​బాస్​ షోలో ఉన్నప్పుడు కొంత నెగెటివిటీ మూటగట్టుకున్నప్పటికీ బయటకు వచ్చాక మాత్రం టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ కెరీర్​లో ముందుకెళ్తోంది. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తనకు సంబంధించిన అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తాటిరేకులో కల్లు తాగుతూ హిమజ ఎంజాయ్‌ చేసింది. చివర్లో కల్లు సూపర్​గా ఉందంటూ ఎక్స్​ప్రెషన్​ కూడా ఇచ్చింది. ట్రెండింగ్​లో ఉన్న ఫేమస్‌ అరబిక్‌ కుతు సాంగ్‌ను ఈ వీడియోకు జతచేసి తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. దాన్ని మీరు చూసేయండి..

సూపర్​గా ఉందంటున్న బిగ్​బాస్​ బ్యూటీ

ఇదీ చదవండి: నేను ఆ నటులతోనే వర్క్​ చేయాలనుకుంటాను: రాజమౌళి

ABOUT THE AUTHOR

...view details