తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ గ్రాండ్ ఫినాలే.. అతిథులు వీరే - బిగ్ బాస్​లో ఆర్​ఆర్​ఆర్​ టీమ్

Bigg Boss Telugu 5 Grand Finale: బిగ్​బాస్​ సీజన్-5 ముగింపు దశకు చేరుకుంది. అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. కాగా, ఈ గ్రాండ్ ఫినాలేకు అతిథులుగా పలువురు హీరోహీరోయిన్లు , డైరెక్టర్లు విచ్చేశారు.

bigg boss
బిగ్ బాస్

By

Published : Dec 19, 2021, 2:28 PM IST

Bigg Boss Telugu 5 Grand Finale: అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యాఖ్యాతగా 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన రియాల్టీ షో 'బిగ్‌బాస్‌ సీజన్‌-5' ముగింపు దశకు చేరుకుంది. టాప్‌-5లో ఉన్న మానస్‌, శ్రీరామ్‌, సన్నీ, షణ్ముఖ్‌, సిరిలలో విజేతగా ఎవరు నిలుస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. సుమారు 104 రోజులుగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ షో గ్రాండ్‌ఫినాలే ఆదివారం సాయంత్రం ప్రసారం కానుంది.

ఈ వేడుకల్లో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్ నుంచి రాజమౌళి, 'బ్రహ్మాస్త్ర' టీమ్‌ నుంచి రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌, 'పుష్ప' ప్రమోషన్స్‌ కోసం రష్మిక, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ స్టేజ్‌పై సందడి చేయనున్నారు. ఇక సాయిపల్లవి, నాని.. హౌస్‌లోకి వెళ్లి ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడనున్నారు. కాగా, కంటెస్టెంట్‌ల ఇంటిసభ్యులు, ఎలిమినేటై ఇంటికి వచ్చిన తోటి కంటెస్టెంట్స్‌ల డ్యాన్స్‌లు, పాటలతో ఈ వేడుకను మరింత సందడిగా మార్చినట్లు కనిపిస్తోంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details