బిగ్బాస్(bigg boss ott winner 2021) ఓటీటీ విన్నర్ దివ్యా అగర్వాల్ మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది(divya agarwal bigg boss). ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో చూసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది. దీనిని చూసిన అభిమానులు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
ఏం చేసిందంటే..
దివ్యా అగర్వాల్(divya agarwal latest photoshoot).. 'కార్టెల్' అనే ఓ వెబ్ షో కోసం ప్రోస్థటిక్ మేకప్ ద్వారా ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారింది. వృద్ధుడిగా మారి అభిమానులను షాక్కు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విపరీతంగా లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. ఆ మేకప్ కోసం కదలకుండా కుర్చీలో అంత సేపు ఆమె కూర్చోవడం.. ఆ పాత్రను ఎంచుకోవడం.. నటన పట్ల ఆమెకు ఉన్న అంకితభావానికి నిదర్శనం అంటూ కామెంట్లు పెడుతున్నారు. దర్శకనిర్మాత ఏక్తా కపూర్ కూడా ఆమెను ప్రశంసించారు. భవిష్యత్లో మరిన్నిసార్లు తామిద్దరం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.