ప్రభాస్ కొత్త సినిమాలో(Salaar Movie Updates) 'బిగ్‌బాస్' ఓటీటీ(Bigg Boss OTT Winner) విన్నర్‌కు అవకాశం దక్కిందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. నటి దివ్యా అగర్వాల్(Divya Agarwal News) 'సలార్'లోని కీలకపాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' బ్యూటీ! - బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ దివ్యా అగర్వాల్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్' చిత్రం(Salaar Movie Updates) రూపొందుతోంది. ఇందులో ఓ కీలకపాత్ర కోసం 'బిగ్‌బాస్' ఓటీటీ(Bigg Boss OTT Winner) విజేత దివ్యా అగర్వాల్‌ను(Divya Agarwal News) సంప్రదించినట్లు సమాచారం. ఈ బంపర్ ఆఫర్‌కు ఆమె అంగీకరించిందట.
హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ 14న(Salaar Movie Release Date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. కన్నడ నటుడు యశ్ హీరోగా వచ్చిన 'కేజీఎఫ్ ఛాప్టర్ 1' చిత్రాన్ని(KGF Movie) కూడా ఈ చిత్ర దర్శకుడే(KGF Movie Director) తెరకెక్కించారు. దానికి కొనసాగింపుగా 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' సినిమా కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదీ చూడండి..ప్రభాస్ సరసన 'కేజీఎఫ్' బ్యూటీ!