Biggboss OTT: బుల్లితెర వేదికగా తెలుగువారికి చేరువైన రియాల్టీ షో 'బిగ్‌బాస్'. ఐదు సీజన్లుగా ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈషో ఇకపై ఓటీటీ వేదికగానూ 24X7 అలరించనుంది. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్యంతోపాటు నటుడు నాగార్జున ప్రకటించారు. శుక్రవారం ఉదయం డిస్నీ హాట్‌స్టార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడారు.
"బిగ్‌బాస్ షోను హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కొవిడ్ సమయంలో తెలుగు ప్రేక్షకులను బిగ్‌బాస్ ఎంతగానో ఎంటర్‌టైన్ చేసింది. నాక్కూడా చక్కటి అనుభూతిని అందించింది. వ్యాఖ్యాతగా అడుగుపెట్టే సమయంలో ఏదో తెలియని భయం.. కానీ అడుగుపెట్టాక.. నేను కూడా ఈ షోకు అభిమానిగా మారిపోయా. ఎపిసోడ్స్ అన్నింటినీ చూడటం మొదలుపెట్టాను. సీజన్-3, 4 పూర్తయ్యాక కంటెస్టెంట్స్ చాలామంది మా ఇంటికి వచ్చి.. 'షో మాకెంతో నేర్పించింది. మేము లైఫ్‌లో ఎంతో సక్సెస్ అయ్యాం' అని చెబుతుంటే నేనెంతో ఆనందించా. ఇక బిగ్‌బాస్-5 షో అప్పుడే అయిపోయిందా.. నమ్మలేకపోతున్నాం అని పలువురు అభిమానులు అడుగుతున్నారు. అదే సమయంలో డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్యం నావద్దకు వచ్చి.. 'బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభించాలనుకుంటున్నాం' అని చెప్పడం విని షాక్ అయ్యాను. చివరికి వాళ్లు ఒప్పించారు. బిగ్‌బాస్‌కు పూర్తి విభిన్నంగా ఈ షో ఉంటుంది. సుమారు 6 కోట్ల మంది బిగ్‌బాస్ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్‌బాస్ షోలన్నింటిలో మన తెలుగు షోనే సూపర్‌హిట్. త్వరలోనే ఈ షో ఓటీటీలో ప్రారంభం కానుంది"
-నాగార్జున, నటుడు
ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు నాగార్జున.
- త్వరలో రాబోయే ఓటీటీ షోకు బిగ్‌బాస్ షోకు వ్యత్యాసం ఉంటుందా..?
నాగార్జున: ఇప్పటివరకూ చూసిన బిగ్‌బాస్ షోకు.. ఓటీటీలో చూడబోయేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండూ విభిన్నమైన ఫార్మాట్లు.
- ఓటీటీలో కూడా మీరు వారంలో రెండు రోజులు కనిపిస్తారా?
నాగార్జున: బిగ్‌బాస్ ఓటీటీ గురించి ఇంకా చర్చలు జరుపుతున్నాం. షో ఎలా ఉండాలి? ఎంతమంది కంటెస్టెంట్స్? ఎన్ని రోజులు? మిగిలిన విషయాలన్నింటి గురించి చర్చించుకుంటున్నాం. అన్నీ ఓకే అనుకున్నాక వచ్చే నెలలో ప్రకటిస్తాం.
- బిగ్‌బాస్ సీజన్-6 ఉంటుందా? దానికి హోస్ట్ మీరేనా?