మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ అగ్రనటుడుఅమితాబ్ బచ్చన్, కన్నడ హీరోసుదీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్ర షూటింగ్ సమయంలో అమితాబ్‌తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు కిచ్చా సుదీప్.
రణ'సినిమాలో తొలిసారి బచ్చన్‌తో నటించానని, మళ్లీ పదేళ్ల తర్వాత ఈ అవకాశం కల్పించినందుకు నిర్మాత రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు.
‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
అమితాబ్ నటిస్తున్న గోశాయి వెంకన్న పాత్రకు సంబంధించిన...సన్నివేశాల చిత్రీకరణపూర్తయినట్లు దర్శకుడు సురేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
"సైరా"... స్వాతంత్య్రపోరాటం నేపథ్యంలో సాగే చిత్రం కావడం వల్ల...సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.తెలుగుతో పాటు, హిందీ, తమిళం తదితర భాషల్లోనూ చిత్రాన్నివిడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు నిర్మాత చరణ్.