తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాగచైతన్య 'థాంక్యూ'కు ఇబ్బందులు తప్పట్లేదు! - 'Thank you' movie news

కరోనా కారణంగా 'థాంక్యూ' చిత్రీకరణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో వేరే లోకేషన్ల కోసం చిత్రబృందం వెతుకుతోంది.

Chay Akkineni's 'Thank you' movie
నాగచైతన్య

By

Published : May 3, 2021, 5:31 AM IST

నాగచైతన్య హీరోగా నటిస్తున్న'థాంక్యూ' సినిమాకు కష్టాలు తప్పట్లేదు. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ చేస్తున్న చిత్రబృందానికి.. ఆ దేశంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అక్కడ చిత్రీకరణ వీలుపడటం లేదు. దీంతో వేరే దేశంలో లోకేషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది 'థాంక్యూ' యూనిట్.

ఇందులో నాగచైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్​రాజు నిర్మిస్తున్నారు.

'థాంక్యూ' చిత్రీకరణలో నాగచైతన్య

ABOUT THE AUTHOR

...view details