సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'.. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను తొలుత అమెరికాలో ప్రారంభించాలని నిర్ణయించినా.. కరోనా కారణంగా దుబాయ్‌లో చిత్రీకరించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
దుబాయ్‌లో జనవరి 25 నుంచి 'సర్కారు వారి పాట' తొలి షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. 25 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరపనున్నారట. ఇందులో మహేశ్ బాబుతో సహా ఇతర నటీనటులు పాల్గొననున్నారని తెలుస్తోంది.