తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వృద్ధ స్నేహితులుగా అమితాబ్​, బొమన్​ ఇరాని - అమితాబ్​ బొమన్​ ఇరాని వార్తలు

బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, దర్శకుడు సూరజ్​ బర్జాత్య కాంబినేషన్​లో ఓ సినిమా రూపొందనుంది. ఇద్దరు వృద్ధ స్నేహితుల నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రంలో అమితాబ్​తో పాటు బొమన్​ ఇరాని నటించనున్నారు.

Big B's next with Sooraj Barjatya costarring Boman Irani is all bout friendship
వృద్ధ స్నేహితులు అమితాబ్​, బొమన్​ ఇరాని

By

Published : Jan 17, 2021, 7:29 AM IST

'మైనే ప్యార్‌ కియా', 'హమ్‌ ఆప్కే హైన్‌ కౌన్‌', 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రాలతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు సూరజ్‌ బర్జాత్య. ఆరేళ్ల విరామం తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్‌ అందుకోనున్నారు. త్వరలో ఆయన సల్మాన్‌ ఖాన్‌తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.అయితే దీని కన్నా ముందు ఆయన అమితాబ్‌ బచ్చన్‌తో ఓ చిత్రం రూపొందించనున్నట్లు సమాచారం.

ఇద్దరు వృద్ధుల స్నేహం నేపథ్యంగా అల్లుకున్న కథతో సూరజ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో అమితాబ్‌ స్నేహితుడిగా మరో ప్రధాన పాత్రలో బొమన్‌ ఇరాని కనిపిస్తారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ఇది పూర్తయిన వెంటనే సల్మాన్‌తో చేయనున్న కొత్త చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం.

ఇదీ చూడండి:ఆ విషయంలో కత్రినా, దీపిక సూపర్: కియారా

ABOUT THE AUTHOR

...view details