బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీకపూర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. 'వక్త్ నే కియా క్యా హసీన్ సితామ్' అంటూ సాగే భావోద్వేగభరిత పాట బ్లాక్ అండ్ వైట్ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వీరిద్దరూ చివరగా కలిసి నటించిన '102 నాటౌట్' సినిమాలోనిది గీతం. 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం.
మరో విశేషమేమిటంటే స్వయంగా బిగ్‌బీ ఈ పాటను పాడారు. దీంతో పాటే "వక్త్ వక్త్ నే కియా క్యా హసీన్ సితామ్... తుమ్ రహె నా తుమ్, హమ్ రహె నా హమ్"అంటూ వ్యాఖ్య జోడించారు అమితాబ్.