తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమితాబ్​ డైలాగులతో అదరగొట్టే ప్రొఫెసర్​ - This Amitabh Bachchan clone

బాలీవుడ్​ లెజెండ్​ అమితాబ్ ​బచ్చన్​ను ఆరాధ్యంగా భావించే అభిమానులు ఎంతోమంది ఉంటారు. మహారాష్ట్ర పుణెలోని ఓ అభిమాని మాత్రం అచ్చుగుద్దినట్టు బిగ్​బీ లానే ఉన్నాడు. ఆయన హెయిర్​ స్టయిల్​, గడ్డం, గాత్రం, హావభావాలు చూస్తే నిజంగా అమితాబే అనుకుంటారు. బిగ్​బీ నటించిన అన్ని సినిమాల్లోని డైలాగులను అచ్చం ఆయన స్టయిల్​లోనే అలవోకగా చెప్పగలడు ఈ వీరాభిమాని.

Big B, amitabh, Shashikant

By

Published : Jun 23, 2019, 1:19 PM IST

అమితాబ్​ డైలాగులతో అదరగొట్టే ప్రొఫెసర్​

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ పేరు వినగానే ఆయన రూపం మన కళ్లల్లో మెదులుతుంది. ఆరడుగులకుపైగా ఎత్తు, ఫ్రెంచ్​ గడ్డం, కళ్లజోడు, ఆయనకే సొంతమైన విభిన్న గాత్రం గుర్తొస్తాయి. అచ్చుగుద్దినట్టు ఇవే పోలికలతో ఉన్నారు అమితాబ్ వీరాభిమాని శశికాంత్​ పెద్వాల్. మహారాష్ట్ర పుణెకు చెందిన ఈయన వృత్తిరీత్యా ఫ్రొపెసర్. మిమిక్రీ షోలూ నిర్వహిస్తారు.

శశికాంత్​... అమితాబ్​ సినిమాల్లోని అన్ని డైలాగులను అచ్చం ఆయన స్టయిల్​లోనే చెప్పడం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తనను తాను 'బిగ్​బీ' జూనియర్​గా చెప్పుకునే శశికాంత్​ ఇప్పటివరకు 1000కి పైగా మిమిక్రీ షోలు నిర్వహించి అమితాబ్​ అనుకరణతో అదరగొట్టారు. ఓ భోజ్​పురి చిత్రంలోనూ నటించారు.

బిగ్​బీ డైలాగులతో శశికాంత్​ ఈ మధ్యే సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్​ అయ్యారు. ఈయన అమితాబ్​ను అనుకరించే తీరు చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details